- రెండో కౌన్సిలింగ్ ద్వారా అందరికీ ప్రవేశం కల్పించాలి
- ఎస్ఎఫ్ఐ డిమాండ్....
ప్రజాశక్తి-పాడేరు(అల్లూరి):-- పాడేరు ఏజెన్సీలోని గురుకుల బాలికల బాలుర కళాశాలలో సీట్లు పెంచాలని రెండవ కౌన్సిలింగ్ ద్వారా అందరికీ ఇంటర్ ప్రవేశం కల్పించాలని కోరుతూ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో ఎస్ఎఫ్ఐ శుక్రవారం ఐ టి డి ఏ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు, ఈ సందర్భంగా స్పందన కార్యక్రమంలో గురుకులం సెల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ అల్లూరి జిల్లా కార్యదర్శి కె ప్రభు దాస్ మాట్లాడుతూ గతంలో కన్నా గురుకులాల్లో ఈసారి ఇంటర్ ప్రవేశానికి సీట్లు తక్కువ కేటాయించారని తెలిపారు. దీంతో దరఖాస్తు చేసుకున్న చాలామంది గిరిజన విద్యార్థినీలు విద్యార్థులకు సీట్లు లభించలేదని చెప్పారు. ప్రతి ఏడాది గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్ల కోసం గిరిజన విద్యార్థులు తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ ఏడాది సీట్లు తగ్గించడం వల్ల దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల చాలామందికి గురుకులాల్లో ప్రవేశం దొరకలేదని అధికారులు వెంటనే స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని దరఖాస్తు చేసుకున్న విద్యార్థిని విద్యార్థులందరికీ సీట్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో చలో ఐటీడీఏ కార్యక్రమం ద్వారా ప్రదర్శనగా తరలివచ్చినట్లు చెప్పారు..ఈ ఏడాది బాలురు 1361 మంది దరఖాస్తు చేసుకోగా 840 మాత్రమే సీట్లు లభించాయని, బాలికలు 1660 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 450 సీట్లు మాత్రమే వచ్చాయని చెప్పారు.అయితే దరఖాస్తు చేసుకొని సీట్లు రాని విద్యార్థుల అందరికీ రెండో కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసారు..ఈ సారి శాంతియుతంగా నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించినట్ల, రెండో కౌన్సిలింగ్ నిర్వహించకపోతే పెద్ద ఎత్తున విద్యార్థులతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు చిన్నారావు,జీవన్ కృష్ణ, వరహాలు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు తదితరులు పాల్గొన్నారు.










