సీనియర్ నటి రాధిక ఓ విదేశీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఇన్‌స్టాలో ఆమె ఓ పోస్ట్ పెట్టారు. 'సినీ కెరీర్‌లో కొత్త ప్రయాణం మొదలైంది. ఫ్రెంచ్ సినిమాలో నటిస్తున్నాను. తొలి రోజు షూటింగ్‌లో పాల్గొన్నాను. కొత్త అనుభూతిని పొందుతున్నా. ఈ విషయంలో నా భర్త శరత్‌కుమార్ ఎంతో ప్రోత్సహించారు' అంటూ ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. షూటింగ్ ఫొటోలను కూడా షేర్ చేశారు.