Sep 27,2023 15:54

ప్రజాశక్తి - యానాం : పుదుచ్చేరి వ్యవసాయశాఖ, డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ యానాం ఆధ్వర్యంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ బుధవారం రైతులకు కూరగాయల సాగు, కిచెన్ గార్డెనింగ్ పై శిక్షణా కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్  పాల్గొని రైతులకు విత్తనాల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ రైతులకు వరి పంటకు కిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని,  వరి పంటనే కాకుండా వివిధ రకాల పంటలను సాగు చేయాలని కోరారు. అందుకు సంబంధించి సాగునీటికి చర్యలు తీసుకుంటామని అన్నారు. అధికారులు సాగునీటిపై దృష్టి సారించాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏఓ మునిస్వామి అగ్రికల్చర్ డిప్యూటీ డైరెక్టర్  ఎస్ గణేశన్, అగ్రికల్చర్ ఆఫీసర్ జోగిరాజు,ఫీల్డ్ ఆఫీసర్స్ ఖాన్, సుబ్బారావు, సబ్బతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.