ప్రజాశక్తి - క్యాంపస్ : బాలలు చక్కగా ఆడుకుని చదువుకునే రోజుల్లో పనులకు వెళ్ళడం తప్పని, బాలకార్మిక వ్యవస్థ చట్టరీత్యా నేరం మని జిల్లా జాయింట్ కలెక్టర్ డికె బాలాజీ అన్నారు. జూన్ మాసం 12 ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం స్థానిక ఎస్.వి.యు క్యాంపస్ స్కూల్ నుంచి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని బాలలు చిన్న వయసులో కార్మికుల మారడం వల్ల మానసిక దృడత్వం లేకుండా, ఆరోగ్యం దెబ్బతిని, ఎదగలేక సమాజంలో తమవంతు భాగస్వామ్యం లేకుండా పోతుందని అన్నారు. ప్రభుత్వం బాలకార్మిక వ్యవస్థ చట్టరీత్యా నేరం అందుకే ఈ చట్టాన్ని పగద్భందీగా అమలు చేస్తున్నామని అన్నారు. బిజినెస్ షాప్ లు , హోటల్స్ , పరిశ్రమల వారు బాలలను పనుల్లో చేర్చుకోరాదని , ప్రభుత్వం చక్కటి విద్య, వసతి కల్పిస్తున్నదని సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి లేబర్ కమిషనర్ బాలు నాయక్, అసిస్టెంట్ కమిషనర్ లేబర్ కృష్ణారెడ్డి, డిఎస్పి కాటమరాజు, ఐసిడిఎస్ అధికారులు , స్వచ్చంద సంస్థలు, కాంపస్ స్కూల్ విద్యార్థులు ఈ ర్యాలి లో పాల్గొన్నవారిలో వున్నారు.










