Jun 08,2023 15:16

ప్రజాశక్తి-తిరుపతి : మా భూములు కాపాడండి అంటూ సురుటుపల్లి గ్రామస్తులు గురువారం తిరుపతి చెన్నై జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రైతుల మాట్లాడుతూ కారని సురుటుపల్లి దాసుకుప్పం మీదగా ఏర్పాటు చేయనున్న బైపాస్ రోడ్డుకు సంబంధించి మా భూములు కోల్పోతూ నష్టం పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడితే తమకున్న భూములన్ని కూడా వదులుకొని నిరాశకు గురికావాల్సిన పరిస్థితి ఉందని కాబట్టి మా భూముల్లో రోడ్డు వేయకూడదని నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న నాగలాపురం ఎస్సై హనుమంతప్ప తన సిబ్బందితో సంఘటjన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి వాహనదారులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వపాఠశాల  ఆవరణంలో రైతులతో ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతు భూములు సర్వే చేసిన అనంతరం  రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.