Apr 27,2023 17:43

పెయింట్‌ వర్క్‌,స్టిక్కరింగ్‌ షాప్‌ను ప్రారంభిస్తున్న వైసీపీ నాయకులు

స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి : వైసిపి
ప్రజాశక్తి - చాగలమర్రి

       యువత, నిరుద్యోగులు స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని వైసిపి రాష్ట మైనార్టీ సెల్‌ కార్యదర్శి బాబులాల్‌, మండల కన్వీనర్‌ కుమార్‌ రెడ్డిలు కోరారు. గురువారం చాగలమర్రికి చెందిన ముల్లా ఇబ్రహీం ఆర్‌అండ్‌బి బంగ్లా వద్ద ఏర్పాటు చేసిన మి ఆర్ట్స్‌, స్ప్రే పెయింట్‌ వర్క్‌, స్టిక్కరింగ్‌ దుకాణాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకులు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తూ సమయాన్ని వృధా చేసుకోకుండా స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలన్నారు. ఉపాధి పొందడంతో పాటు మరో నలుగురికి జీవనోపాధి కల్పించిన వారవుతారన్నారు. అనంతరం అతిధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ సోహెల్‌, వైస్‌ ఎంపిపి రఫి, వైసిపి నాయకులు ముల్లా ఖాదర్‌ భాష, ఖాజా రసూల్‌, అబ్ధుల్లా, బబ్లూ, ప్రకాష్‌, ప్రచార కార్యదర్శి పెయింటర్‌ రఫీ తదితరులు పాల్గొన్నారు.