స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి
- ఎంపిపి వీరభద్రుడు
ప్రజాశక్తి - చాగలమర్రి
యువత, నిరుద్యోగులు స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని ఎంపిపి రామిశెట్టి వీరభద్రుడు, వైసిపి మండల కన్వీనర్ కుమార్ రెడ్డిలు ఆకాంక్షించారు. మంగళవారం చాగలమర్రి పట్టణంలోని న్యూబిల్డింగ్స్ కాలనీకి చెందిన నిరుద్యోగి పఠాన్ అనీష్ ఖాన్ స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన జెంట్స్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్‌ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకులు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తూ సమయాన్ని వృధా చేసుకోకుండా స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలన్నారు. ఉపాధి పొందడంతో పాటు మరో నలుగురుకి ఉపాధి చూపించిన వారు అవుతారని అన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు తోడేండ్లపల్లె సర్పంచ్ గోవిందయ్య, ముల్లా ఖాదర్ బాషా, ఖాజా రసూల్, బబ్లు, నాగేంద్ర, ఐడియా బాబు, ఖదీర్, అబ్దుల్లా మబూసున్నా, బ్రాందిన్, ఉపాధ్యాయ సంఘం నాయకులు రవీంద్రారెడ్డి, రషీద్ ఖాన్, గౌస్, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.










