Sep 08,2023 21:33

ఆహా క్యాంటీన్‌ను ప్రారంభిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-హిందూపురం : పురపాలక సంఘ వ్యాప్తంగా ఉన్నా స్వయం సహాయక సంఘాల వారు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలతో స్వశక్తితో వృద్ది చెందాలని వైసిపి ఇన్‌చార్జ్‌ దీపిక వేణు రెడ్డి అన్నారు. పట్టణంలోని డిబి కాలనీలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహా క్యాంటీన్‌ను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంజ్రదజతో కలిసి దీపిక ప్రారంభించారు. ఈ సందర్బంగ వారు మాట్లాడుతు పురపాలక సంఘ వ్యాప్తంగా ఉన్నా మహిళా సంఘాల వారు ప్రభుత్వం అందిస్తున్న సున్నా వడ్డీ రుణాలను తీసుకుని, వాటి ద్వారా చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించి, ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. క్యాంటీన్‌ నిర్వహకులు నాణ్యమైన భోజనాన్ని ప్రజలకు సరసమైన ధరలకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ బలరాం రెడ్డి, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జనార్దన్‌ రెడ్డి, రాష్ట్ర బెస్త కార్పొరేషన్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు మంజుళ, షాజియా,నాగేంద్రబాబు, జయప్ప, కో ఆప్షన్‌ నెంబర్స్‌ సువర్ణమ్మ, కాంతమ్మ, నింకంపల్లి మన్సూర్‌, నాయకులు రాంమూర్తి, రవీంద్రుడు, తిమ్మారెడ్డి, సుభాష్‌ గాంధీ, మెప్మా హరినాథ్‌ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.