ప్రజాశక్తి - నరసాపురం టౌన్
మండలంలోని సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ అటానమస్ కళాశాలలో ఐక్యూఎస్‌సి వారి ఆధ్వర్యంలో రిటైర్డ్ మేజర్ జనరల్ బివి.రావుతణుకు వారిచే నేషన్స్ ఫెస్ట్ అనే అంశంపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మేజర్ జనరల్ బివి.రావు మాట్లాడుతూ జాతీయ భద్రతలో సాయుధ దళాల పాత్ర, పౌరుల బాధ్యత గురించి ఆర్మీ కోర్సుల్లో విద్యార్థులు ఏ విధంగా ప్రవేశించాలో దానికి సంబంధించిన సలహాలు, సూచనలు విద్యార్థులకు అందించారు. వివిధ డిపార్ట్‌మెంట్ విభాగాధిపతులు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఐక్యూఎస్‌సి కో-ఆర్డినేటర్స్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్‌కుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎ.గోపీచంద్ మాట్లాడారు. ఈవెంట్ కో-ఆర్డినేటర్‌గా సురేష్‌కుమార్ పాల్గొన్నారు. చీఫ్ గెస్ట్ మేజర్ జనరల్ బి.వెంకట్రావును కళాశాల మేనేజ్‌మెంట్ వారు ఘనంగా సత్కరించారు.










