
ప్రజాశక్తి - నరసాపురం టౌన్
సీతారామపురం స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ టెక్నాలజీ అటానమస్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కాకినాడ జెఎన్‌టియుకు చెందిన డైరెక్టర్ కెవిఎస్‌జి.మురళీకృష్ణ హాజరయ్యారు. ఈ అవగాహన సదస్సులో కళాశాల ఛైర్మన్ కెవి.సత్యనారాయణ, కోశాధికారి కె.వెంకటేశ్వరస్వామి, పాలకవర్గ సభ్యులు అడ్డాల శ్రీహరి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్‌కుమార్, డాక్టర్ పి.పండరినాధులు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, బీటెక్ మొదటి సంవత్సరం హెచ్‌ఒడి డాక్టర్ వి.స్వామినాథన్, వివిధ డిపార్ట్‌మెంట్ అధ్యాపకులు, విభాగాధిపతులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.