స్వర్ణ ఆస్పత్రిని ప్రారంభించిన మేయర్
ప్రజాశక్తి- తిరుపతి సిటీ
తిరుపతి నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్ణ హాస్పిటల్ ను తిరుపతి కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష ప్రారంభించారు. స్థానిక లీలామహల్ సర్కిల్ సమీపంలోని కొర్లగుంట ఎస్బిఐ బ్రాంచ్ ఎదురుగా ఏర్పాటుచేసిన ఆస్పత్రి ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ వైద్యరంగంలో అనుభవం గడిచిన డాక్టర్ రాజేష్ కుమార్ స్వర్ణ హాస్పిటల్ ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించేందుకు మరో ముందడుగు వేయడం అభినందనీయమన్నారు. ఎందుకంటే ఆసుపత్రి అధినేతలు డాక్టర్ రాజేష్ కుమార్, డాక్టర్ స్వర్ణలత మాట్లాడుతూ 15 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఉద్దేశంతో చిన్న క్లినిక్ ను ప్రారంభించామన్నారు. అప్పటినుంచి అందరికీ నాణ్యమైన వైద్యం అందిస్తూ రోగులు వారి కుటుంబ సభ్యుల మన్ననలను పొందామన్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అత్యధిక సౌకర్యాలతో మల్టీ స్పెషల్ వైద్య సేవలతో నూతన భవనాన్ని ఏర్పాటు చేశామన్నారు. గైనకాలజీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ , అత్యవసర వైద్య సేవలతో పాటు ఎక్స్ రే, స్కానింగ్, ల్యాబ్లేటరీ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. త్వరలో ఆర్థోవిభాగాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 24 గంటలు అన్ని వ్యాధులకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీహరి, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ మునిశేఖర్ పాల్గొన్నారు.










