స్విమ్స్‌లో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన
తిరుపతి సిటి : స్విమ్స్ మెడికల్ అంకాలజీ విభాగం ఆధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్విమ్స్ సంచాలకులు ఆర్‌వి కుమార్, అంకాలజీ విభాగాధిపతి డాక్టర్ భార్గవి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో క్యాన్సర్ అవగాహనా నెలగా గుర్తించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన రోగులకు మద్దతుగా నిలబడి వారికి మనోధైర్యాన్ని నింపుతున్నట్లు చెప్పారు. మహిళలు ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారని, మొదటిదశలో గుర్తించడం ద్వారా పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రవితేజ, ఆదిత్య, కీర్తన, మౌర్యరెడ్డి, నర్సింగ్ డిప్యూటీ డైరెక్టర్ ప్రభావతి పాల్గొన్నారు.










