Sep 23,2023 21:50

విరాళం అందిస్తున్న దాత

స్విమ్స్‌కు రూ.10 లక్షల విరాళం
తిరుపతి సిటి : శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్‌) ఆసుపత్రికి తెనాలి పట్టణానికి చెందిన బిట్‌ యూనివర్శిటీ, (అమరావతి) నందు బి.బి.ఏ సెకండియర్‌ చదువుతున్న శ్రీరాం వెంకటలక్ష్మి సరయు పది లక్షల రూపాయల విరాళాన్ని స్విమ్స్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ దేవరకొండ గోపికి అందజేశారు. పేద ప్రజలకు అందిస్తున్న వైద్యుసేవలకు గాను ఈ విరాళాన్ని ఇచ్చానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ మేనేజర్‌ సురేష్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సతీష్‌, సూపరింటెండెంట్‌ నాగప్రసూన పాల్గొన్నారు.
విరాళం అందిస్తున్న దాత