స్విమ్స్ దేశంలో నంబర్ 1 కావాలి : ఈవో
ప్రజాశక్తి - తిరుపతి సిటి
స్విమ్స్ దేశంలోనే నంబర్ 1 కావాలని టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి అన్నారు. మహతి ఆడిటోరియంలో శ్రీ పద్మావతి మహిళా మెడికల్ కళాశాల విద్యార్థినులకు బుధవారం చేపట్టిన మోటివేషనల్ టాక్ విజయవంతమయ్యింది. ఈవో ఎవి ధర్మారెడ్డి మాట్లాడుతూ స్విమ్స్‌ను న్యూఢిల్లీలోని ఎయిమ్స్ స్థాయికి చేర్చాలన్నారు. స్విమ్స్ సంచాలకులు ఆర్‌వి కుమార్, డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ల బిట్ల, ప్రిన్సిపాల్ ఉషా కళావత్, వైస్ ప్రిన్సిపాల్స్ ముత్తీశ్వరయ్య, నాగరాజు పాల్గొన్నారు. విద్యార్థులు కోరిన సౌకర్యాల పట్ల ఈవో సానుకూలంగా స్పందించారు. విద్యార్థినుల కోసం నూతనంగా నిర్మిస్తున్న హాస్టల్ వసతి సముదాయాన్ని నవంబర్‌లో ప్రారంభిస్తామన్నారు. అధర్వణ వేదంలో భాగమైన ఆయుర్వేదాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. ప్రధానంగా వేద విశ్వవిద్యాలయంలో ఉన్న వైద్య విజ్ఞానానికి పనికి వచ్చే పుస్తకాలను, ఎస్వీబీసి ప్రసారం చేస్తున్న భగవద్గీతలోని తాత్పర్య సహిత శ్లోకాలను కనీసం రోజుకు ఒక్కటి చదవాలని సూచించారు.
మెడికల్ విద్యార్థులతో ఈవో ముఖాముఖి










