
స్వీయ రక్షణకు తైక్వాండో అవసరం
- శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
- ఆత్మకూరులో తైక్వాండో సమ్మర్ క్యాంప్ ప్రారంభం
ప్రజాశక్తి - ఆత్మకూరు
స్వీయ రక్షణకు తైక్వాండో క్రీడా సాధన చాలా అవసరమని, దీంతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు. ఆదివారం ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉన్న కెవికె ఇండోర్ స్టేడియంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో తైక్వాండో కోచ్ జి.షబ్బీర్ హుస్సేన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తైక్వాండో సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ను ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తైక్వాండో క్రీడా సాధన చేయడం వల్ల విద్యార్థుల్లో దృఢమైన ఆత్మవిశ్వాసం కలుగుతుందని చెప్పారు. జాతీయస్థాయిలో పథకాలు వచ్చేలా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. క్రీడాకారులకు పుట్టినిల్లుగా, ప్రత్యేకంగా ఆత్మకూరు కేంద్రంగా ఉందని, ఎంతోమంది క్రీడాకారులు వివిధ క్రీడలలో ఉన్నత స్థానాలలో రాణించారని తెలిపారు. క్రీడలకు వైసిపి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. గతంలో తమ సొంత నిధులు వెచ్చించి ఆత్మకూరు పట్టణంలో రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు నిర్వహించామని గుర్తు చేశారు. మన ప్రాంత కోచ్ జి.షబ్బీర్ హుస్సేన్ ఇక్కడ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసి పిల్లలకు శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ పివి.రమణ మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో తైక్వాండో కోచ్ జి.షబ్బీర్ హుస్సేన్ అధ్యక్షతన సమ్మర్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషమన్నారు. ఈ సమ్మర్ క్యాంప్‌ను క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ ఎంఎన్‌వి.రాజు, వైసిపి ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు సయ్యద్ మీర్, మున్సిపల్ చైర్మన్ మారుఫ్ ఆసియా, కౌన్సిలర్లు విజరు చౌదరి, సుల్తాన్, రహిమాన్, మగ్బూల్, కలిముల్లా, కో ఆప్షన్ సభ్యులు ఎంఏ.రషీద్, మాజీ కౌన్సిలర్లు లాలు, స్వామి, నాయకులు పువ్వాడి భాస్కర్, వరాల మాలిక్, అహ్మద్ రసూల్, ఉమర్ అలీ రషీద్, పైల్వాన్, గౌండా రఫీక్, మీర్ మాబు, హబీబ్, నాగరాజు, తెలుగు శ్రీను, దామోదర్ రమేష్ శెట్టి, ఖుద్దూస్, చిట్యాల వెంకటేశ్వర్ రెడ్డి, తిమ్మయ్య, క్రీడోపాధ్యాయులు, తైక్వాండో శిక్షకులు ఖాజా హుస్సేన్, సీనియర్ క్రీడాకారుడు ఎఎండి రఫిక్ తదితరులు పాల్గొన్నారు.











