Nov 18,2023 19:36

కమిషనర్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
మున్సిపల్‌ ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న స్వీపర్లకు పెండింగ్‌ జీతాలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.ఈరన్న, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు తిప్పన్న, పిఎస్‌.గోపాల్‌ డిమాండ్‌ చేశారు. శనివారం సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్వీపర్లుగా 15 ఏళ్ల నుంచి పని చేస్తున్నా కేవలం రూ.4 వేలు చెల్లిస్తూ వెట్టిచారికి చేయించుకుంటున్నారని విమర్శించారు. అది కూడా నాలుగు నెలలకోసారి ఇవ్వడంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అందరికీ ఆర్డర్‌ ఫారాలు ఇవ్వాలని, ప్రతి నెలా 1న జీతాలు నేరుగా అకౌంట్లలో వేయాలని కోరారు. జిఒ ప్రకారం కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వైపి.ఈరమ్మ, కార్యదర్శిగా విజయలక్ష్మి, కోశాధికారిగా ఎం.రాజేశ్వరిని ఎన్నుకున్నారు.