ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసేందుకు స్వీప్ యాక్టివిటీని ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ షన్మోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సభా వేదిక వద్ద ఓటర్ల సంక్షిప్త సవరణకు సంబంధించి సంబంధించి ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, ప్రత్యేక అధికారులు, మండల స్థాయి బృందాలతో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల సంక్షిప్త సవరణ 2024కి సంబంధించి 2023 అక్టోబర్ 27న ముసాయిదా ఫోటో ఓటర్ల జాబితాను విడుదల అయిందన్నారు. ఇందులో జెండర్, ఈపి రేషియోలపై తహశీల్దార్‌లు వారి మండల పరిధిలోని పోలింగ ్‌స్టేషన్‌ల వారిగా దృష్టి సారించాలన్నారు. ఓటర్ల జాబి తాలో మణించిన, పెళ్లి అయినన వారు, బదిలీ అయిన ఉద్యోగస్తులు పేర్లు ఇంకా తొలగించపోవడం వల్ల ఈపి రేషియో పెరగడానికి కారణాలు ఉండోచ్చు అన్నారు. వీటిని మరోసారి పరిశీలించాలని ఆదేశిం చారు. రేషియో తక్కువ ఉన్న చోట ఓటర్లుగా కాని వారు ఉంటారని, అలాంటి వారిని గుర్తించి నమోదు చేయాలని తెలిపారు. ప్రధానంగా 18, 19ఏళ్లు నిండి న విద్యార్థుల కళాశాలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, ఎన్‌రోల్ చేయాలని సూచించారు. అందుకు సంబ ంధించి క్లైంల స్వీకరించి బిఎల్‌వోలు వెరిఫికేషన్ చేయాలన్నారు. నవంబర్ 4, 5, డిసెంబర్ 2, 3 తేదీలలో ఓటర్ల జాబితా సవరణకు ప్రత్యేక శిబిరాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయా లన్నారు. ముసాయిదా జాబితాలో తప్పులు, అనర్హులైన ఓటర్ల వివరాలను సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ల దృష్టికి సరిచేయాలన్నారు. డిసెంబర్ 26న ఆక్షేపణ లపై విచారణ పూర్తి చేయడం, జనవరి 01న డేటా బేస్‌లో వివరాలను అప్‌లోడ్ చేసి, జనవరి 05న తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. నిబంధనలకు లోబడి బాధ్యతాయుతంగా వ్య వహరించాలని దిశానిర్ధేశం చేశారు. జిల్లా స్థాయిలో జరిగిన వర్క్ షాప్‌లో తెలుసుకున్న విషయాలను డివి జన్ స్థాయిలో, మండల స్థాయిలో శిక్షణా కార్యక్ర మాలను నిర్వహించి పారదర్శకమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు అందరూ కలసి పని చేయాలని ఆద ేశించారు. కార్యక్రమంలో ఓటర్ల సంక్షిప్త సవరణ 20 24 సంబంధించి అంశాలను పవర్ పాయింట్ ప్రె జెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో జెసి శ్రీ నివాసులు, డిఆర్‌ఓ రాజశేఖర్, జెడ్పి సిఈఓ ప్రభా కర్‌రెడ్డి, చిత్తూరు, నగరి, పలమనేరు, కుప్పం ఆర్డిఓలు చిన్నయ్య, సుజన, మనోజ్ కుమార్‌రెడ్డిలు, ట్రైనీ డిపూ ్యటీ కలెక్టర్లు కిరణ్మయి, లక్ష్మీ ప్రసన్న, పాల్గొన్నారు.










