ప్రజాశక్తి- నగరి: జన్మనిచ్చిన నేల తల్లిని, స్వేచ్ఛగా జీవించేందుకు అవకాశం కల్పించిన దేశాన్ని గౌరవించుకునేందుకే నా మట్టి.. నా దేశం కార్యక్రమమని రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు. గురువారం నగరి పట్టణంలో నియోజకవర్గస్థాయి నా మట్టి నా దేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఓంశక్తి ఆలయం వద్ద నుంచి టవర్‌క్లాక్ సెంటర్ వరకు దేశభక్తి నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. టవర్‌క్లాక్ సెంటర్‌లో జాతీయ పతాకాన్ని అవిష్కరించారు. అన్ని మండలాల నుంచి వచ్చిన మట్టిని ఒకచోటకు చేర్చి ఆ మట్టిని చేతబట్టి ప్రతిజ్ఞ చేశారు. నగరి, పుత్తూరు మున్సిపల్ చైర్మన్లు పీజీ నీలమేఘం, హరి, వైస్‌చైర్మన్‌లు బాలన్, జయప్రకాష్, శంకర్, వెంకటరత్నం, ఎంపీపీలు భార్గవి, మునివేలు, దీప, విజయలక్ష్మి, జమున, మున్సిపల్ కమిషనర్లు వెంకట్రామిరెడ్డి, కెఎల్‌ఎన్ రెడ్డి, ఎంపీడీవోలు లీలామాదవి, ప్రసాద్, చంద్రమౌళి, భానుమూర్తి పాల్గొన్నారు.










