సైన్యాల శక్తి పైకి కనిపిస్తుంది
అది నామకార్థమైంది, కాలం స్థలం పరిమితులుంటాయి
అయితే ఆ శక్తి కాపాడే అధికారవ్యవస్థ ఎదుట
సాహసోపేతంగా పోరాడే ప్రజలు ధైర్యం ఇచ్చే వెలుగు
స్వాతంత్రం కోసం పోరాటాన్ని
ఇష్టానుసారం తొక్కిపట్టడం సాధ్యమేనా?
- విలియం వర్డ్స్‌వర్త్
* అద్భుత కాంతులు *
అనర్ఘ రత్నాల అద్భుత కాంతులెన్నో
అగాధ సముద్రపు అడుగున చీకటి గుహల్లో
అందాల పుష్పాల సౌరభాలెన్నో
వ్యర్థంగా ఎడారుల ఇసుక మేటల్లో
- ఇంగ్లీషు కవి థామస్ గ్రే (1716-71)
* దిగువ తరగతి *
ఒకవేళ దిగువ తరగతి వుంటే నేను అందులో వుంటాను
ఒకవేళ నేరస్త శక్తులు వుంటే అందులో నేనుంటాను
ఒకవేళ జైలులో ఆత్మ వుంటే అందులో నేనుంటాను
- ఎంజెనీ విక్టర్ డెబ్స్ (1855-1926) అమెరికా సోషలిస్టు నాయకుడు
* అమరులు *
తన సాటి మనుషులు చేసిన తప్పులను, క్రూరత్వాన్ని, అన్యాయాన్ని చురుగ్గా బలపర్చిన లేదా మౌనంగా సహించిన వారితో పోలిస్తే.. తప్పులకు వ్యతిరేకంగా తన జీవితాన్నే ఫణంగా పెట్టి పోరాడిన మనిషి రుషితుల్యుడవుతాడు. ఈ క్రమంలో అతని జీవితంతో పాటు ఇతరుల జీవితాలూ నాశనమైతే కావచ్చు. తమలో ఏ పాపం లేని వారు అలాంటి వారిపై మొదటిరాయి విసరవచ్చు
- ఎమ్మా గోల్డ్‌మన్ (1869-1940) అమెరికా రచయిత