Sep 23,2023 00:05

ప్రజాశక్తి - వేటపాలెం
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఎంపీడీవో చింతల రుతమ్మ అన్నారు. మండలంలోని దేశాయిపేటలో స్వచ్ఛత హైసేవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు గ్రామాలలోని అన్ని వీధులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించారు. ప్రతి ఇంటికి రెండు బావులు కలిగిన మరుగుదొడ్లు తప్పనిసరని అన్నారు. సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీ చూపరులను ఆకట్టుకుంది. విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రామ్ కుమార్, ఈఓఆర్డి సజ్జ శ్రీలక్ష్మి, సెక్రటరీ శ్రీనివాసరావు, గుమస్తా కోటేశ్వరరావు పాల్గొన్నారు.