Dec 16,2022 23:47

పెద్దవీధి రోడ్డుకు మరమ్మతులు చేస్తున్న యువత

గ్రామస్తుల విరాళం, యువత సహకారంతో పనులు చేపట్టిన సర్పంచ్‌
ప్రజాశక్తి -ముంచింగిపుట్టు:
గ్రామంలో అధ్వానంగా ఉన్న సిసిరోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ఎన్నోమార్లు అధికారులు, నేతలకు విన్నవించారు. తమ గోడు అరణ్యరోదనే తప్ప ఏ ఒక్కరూ స్పందించని పరిస్థితుల్లో సర్పంచ్‌ చొరవ తీసుకోవడంతో గ్రామస్తులంతా సంఘటితమై తలో కొంత విరాళం వేసుకుని నిధులు సమీకరించారు. యువత సహకారంతో అధ్వానంగా ఉన్న సిసిరోడ్డుకు స్వచ్ఛందంగా మరమ్మతులు చేపట్టారు. వివరాల్లోకి వెళితే...
మండలంలో కిలగాడ పంచాయతీ కేంద్రంలోని పెద్దవీధి సిసి రోడ్డు అధ్వానంగా ఉండడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డు బాగు చేయాలని సర్పంచ్‌ శివశంకర్‌ ఆధ్వర్యంలో పలుమార్లు అధికారులు, నేతలకు విన్నవించారు. ఏఒక్కరూ స్పందించని పరిస్థితుల్లో గ్రామప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు వేసుకుని, సిసిరోడ్డులోని గోతులకు మరమ్మతులు చేపట్టారు. అస్తవ్యస్తంగా ఉన్న సిసిరోడ్డుతో ప్రజల అవస్థలను గుర్తించిన సర్పంచ్‌ శివశంకర్‌,పంచాయతీ ఖాతాలో నిధులు లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో విషయాన్ని గ్రామస్తులకు చెప్పారు. తలోచేయి వేసి, విరాళాలను సమీకరించి, సర్పంచ్‌ ఆధ్వర్యంలో యువత సహకారంతో ఎవరో వస్తారని ఎదురుచూడకుండా మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ శివశంకర్‌ మాట్లాడుతూ, మారడంతో ప్రభుత్వానికి అనేకమార్లు వినతిలిచిన నిధులు మంజూరు కాకపోవడంతో సర్పంచ్‌ శివశంకర్‌, గ్రామ ప్రజలు సొంత నిధులు సమీకరించి సిసి రోడ్డును మరమ్మత్తులు చేశారు. గ్రామ ప్రజల పడుతున్న అవస్థలను గుర్తించి రవాణా సౌకర్యాన్ని గ్రామపంచాయతీ ఏటువంటి నీదులు లేనప్పటికీ గ్రామములో ఉన్న యువత, స్థానిక సర్పంచ్‌ చొరవతీసుకొని చిన్న చిన్న గుంతలను మరమతులను చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ పంచాయతీలో పరిధిలో అనేక సమస్యలున్నప్పటికీ నిధులు కొరతతో ఏం చేయలేని పరిస్థితి ఉందని, దీంతో అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించాలని కోరినా ఎటువంటి స్పందన లేకపోవడంతో ప్రజలంతా ఏకమై సమస్యను తాత్కాలికంగా పరిష్కరించామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, అధ్వాన సిసి రోడ్డుకు శాశ్వతంగా పటిష్టం చేయాలని కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు బి.శ్రీనివాస్‌పడాల్‌, వాలంటీర్లు కె.బాబూలాల్‌, బి.రాంబాబు, స్థానిక యువత రాజుబాబు, ఎం.కృష్ణమూర్తి, ఎం.అనిల్‌కుమార్‌, వి.సత్యనారాయణ, కె.మహేష్‌, కామరాజు పాల్గొన్నారు.