Jun 29,2023 21:21

'స్వచ్ఛందంగా సేవలు కొనసాగించాలి'

రాయచోటి : మానవతా సేవలో కుల మత ప్రాంత లేదా అభిప్రాయాలు లేకుండా స్వచ్ఛందంగా సేవలు కొనసాగించాలని వ్యవస్థాపకులు రామ చంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఎస్‌ఆర్‌ కళ్యాణ మండ పంలో మానవతా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వ హించారు. రాయచోటి మానవత శాఖ అధ్యక్షులు కనపర్తి శివశంకర్‌ రెడ్డి, చైర్మన్‌ అరమాటి శివగంగిరెడ్డి అధ్యక్షతన నూతన కార్యవర్గం ప్రమాణ స్పీకా రోత్సవం నిర్వహించారు. ముందుగా రేస్కో మాజీ చైర్మన్‌ సదిపిరాళ్ళ కృష్ణారెడ్డి, కడప శ్రీ షిర్డీ సాయి ఎలక్ట్రికల్‌ వారి సౌజన్యంతో శాంతి రథంను మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి, మానవత కడప జిల్లా డైరెక్టర్‌ రామాం జులురెడ్డి, ఎన్‌జిఒ జిల్లా అధ్యక్షులు ప్రసాద్‌ యాదవ్‌ , మానవత గౌరవ డైరెక్టర్‌ లోకనాధ రెడ్డి,సెంట్రల్‌ డైరెక్టర్‌ నిమ్మనపల్లి సహదేవ రెడ్డితో కలిసి వారు ప్రారంభించారు. అనంతరం నుతనగా ఎన్నికైనా కార్యవర్గానికి మాన వత జిల్లా అధ్యక్షులు ప్రసాద్‌ యాదవ్‌ అధ్యక్షతన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా మానవత వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా తత్వంతోపాటు సమాజ సేవకు ఉపయో గపడే కార్యక్రమాలు చేయాలన్నారు. మనం శాశ్వతం కాదని, మనం చేసే సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తాయని చెప్పారు. మాజీ ఎంపిపి పోలు సుబ్బా రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకార్థం ఒక ఫ్రీజర్‌ బాక్స్‌ను మానవత సంస్థకు అందజేస్తామని తెలిపారు. భవి ష్యత్తులోనూ మానవత సేవలకు తమ సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టంగా తెలియజేశారు. జడ్‌పిటిసి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ సమిష్టి కషితో మానవత స్వచ్చంద సంస్థ ద్వారా అవసరం అయ్యే వారికీ సేవలు అందజే యడం చాలా సంతోషదాయకం అని అన్నారు .మానవత సంస్థకు ఎ విధమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉంటానన్నారు .మాజీ అధ్యక్షుడు కనపర్తి శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ అందరి సహకారంతో 600 పై గా సభ్యత్వాలు నమోదు చేయడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కార్యదర్శి రామానాయుడు సహకారం మరువలేనిది అన్నారు. నూతన అధ్యక్షులు వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ అందరి సహకారంతో రాయచోటి మానవత శాఖ తరపున మెరుగైన సేవలు అందజేయడంతో పాటు మానవత సంస్థ సభ్యత్వాలు నమోదు పెచేందుకు కషి చేస్తామన్నారు.మానవత రథాన్నిపారంభిస్తున్న రామచంద్రారెడ్డి, సభ్యులు