ప్రజాశక్తి - హుకుంపేట: మండలంలోని సంతారి పంచాయతీ చినబూరుగుపుట్టు మహిళలు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యాధులు రాకుండా ఉండాలంటే సురక్షిత మంచినీరు తాగడం కూడా ఒక మార్గమని గుర్తించిన వారంతా గ్రామంలోని మంచినీటి ట్యాంకును నెలకోసారి రెగ్యులర్‌గా శుభ్రపరుస్తుంటారు. ఇందులో భాగంగానే సోమవారం గ్రామంలోని 50కుటుంబాల నీటి అవసరాలను తీర్చే ఏకైక నీటిట్యాంకును శుభ్రపరించారు. సిహెచ్‌డబ్ల్యు కె.పుష్సవతి ఆధ్వర్యంలో మహిళలరదరూ సమిష్టిగా ముందుకొచ్చి మంచినీటి ట్యాంకును కడిగారు. ఇలా ప్రతినెలా చేయడం వల్ల కలుషిత నీటి సమస్యను అధిగమించి, కొన్ని వ్యాధులైనా దరిచేరకుండా ఉంటాయని వీరంతా అంటున్నారు. చినబూరుగుపుట్టు మహిళల్లో ఈ చైతన్యం, అవగాహన పలువురికి ఆదర్శంగా నిలుస్తోందని పలువురు అంటున్నారు. కార్యక్రమంలోవైస్ సర్పంచ్ కాసులమ్మ, వాలంటీర్ లక్ష్మణ్, నూకరాజు, రాంబాబు, సింహాచలం, సుధాకర్, వెంకటరమణ, గ్రామ మహిళలు జయప్రభ, కృష్ణవేణి, మిరాజ, చెల్లమ్మ, గంగ, జ్యోతి, కొండమ్మ, భీములమ్మ, పద్మ, భాగ్య, దుర్గమ్మ, చిలకమ్మ పాల్గొన్నారు.










