
ప్రజాశక్తి-ఉయ్యూరు : పరిసరాలు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం ద్వారా ప్రజారోగ్యానికి పాటు పడుతున్న స్వచ్చంద సంస్థల సేవలు అభినందనీయమని ఉయ్యూరు నగరపంచాయతీ కమిషనర్ పి.వెంకటే శ్వరరావు అన్నారు. లయన్స్ వరల్డ్ సర్వీస్ డే లో భాగంగా ఉయ్యురు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్చభారత్ - స్వచ్చ సేవాకార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఉయ్యూరు ఇంగ్లీషు మీడియం సూల్, అమరవాణి స్కూల్ విద్యార్థులతో కలసి క్లబ్ సభ్యులు స్వచభారత్ అవగాహన ప్రదర్శన నిర్వహించి పారిశుధ్య కార్మికులతో కలసి రోడ్లు ఊడ్చి శుభ్రపరిచారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం పారిశుధ్యకార్మికులు చేస్తున్న విధినిర్వహణకు పరిసరాల పరిశుభ్రంగా ఉంచి ప్ర జలు సహకరించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మెరుగైన ప్రజారోగ్యం, ప్రగతి ప్రయాణం సాధ్యమని క్లబ్ జిల్లా ట్రెజరర్ నూకల సాంబశివరావు అన్నారు. పరిశుభ్రత, పచ్చదనం పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతగా పాటించాలని సూచించారు. పచ్చదనం, పరిశుభ్రతలో విద్యార్థులను భాగస్వాములు చేయడం అవసరమని, ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు దోహద పడుతుందని క్లబ్ అధ్యక్షుడు ఎండి ఇస్మాయిల్ అన్నారు. క్లబ్ కార్యదర్శి నల్లా శ్రీనివాసరావు, ట్రెజరర్ వూర కిషోర్ కుమార్, ప్రతినిధులు రావులపల్లి సుధాకర్, కుటుంబరాజు, నెల్లి రాంబాబు, దిన వహి ప్రసాద్, ఎంకె బాబు, పీవీ నాగరాజు, విశ్రాంత ఉపాధ్యాయుడు హాసన్ పాల్గొన్నారు.హొ