Aug 27,2023 21:40

ప్రజాశక్తి - మండవల్లి
    గ్రామంలోని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే విధంగా పంచాయతీ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టామని అప్పాపురం సర్పంచి బుర్ల భోగేశ్వరరావు తెలిపారు. గ్రామంలోని మంచినీటి చెరువులో బ్లీచింగ్‌ చల్లుతున్న విధానాన్ని, చెరువును నీటితో నింపే విధంగా ఏర్పాటు చేస్తున్న మోటార్‌ పనులను ఆయన ఆదివారం దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని, తాగునీటి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేలా మంచినీటి చెరువులో పూర్తిస్థాయిలో బ్లీచింగ్‌ చల్లించామన్నారు. అంతేకాకుండా గ్రామంలోని ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్‌ మోటార్లను ఏర్పాటు చేసి, చెరువును పూర్తిస్థాయిలో నీటిని నింపుతున్నామని తెలియజేశారు.