
ప్రజాశక్తి - కలిదిండి
ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన తాగు నీరందించడమే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు కైకలూరు నియోజకవర్గ ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు తెలిపారు. మండలంలోని సంతోషపురంలో రూ.5 లక్షల నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న మైక్రో ఫిల్టర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామ సచివాలయం వద్ద జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చందన ఉమామహేశ్వరరావు, సంతోషపురం, కలిదిండి, పడమటిపాలెం సర్పంచులు ద్రోణాద్రి నాగలక్ష్మి, మసిముక్కు మారుతీ ప్రసన్న, సానా మీనా సరస్వతి, వైస్ ఎంపిపిలు కూసంపూడి కనక దుర్గారాణి, కట్టా నాగలక్ష్మి, ఎఎంసి ఉపాధ్యక్షులు పాము రవికుమార్, పిహెచ్‌సి, ఏలూరు వైద్యులు పాల్గొన్నారు.