కడప : జిల్లాలో స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించాలని, పోలింగ్ స్టేషన్ల సమస్యలు ఉంటే వెంటనే తెలియ జేయాలని కలెక్టర్ వి.విజరు రామరాజు రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్ హాలులో ఓటర్ల జాబితా పరిశీలనపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్ తోపాటు జెసి గణేష్ కుమార్, కడప నగర మేయర్ సురేష్ బాబు, కడప నగర కమీషనర్ ప్రవీణ్ చంద్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ డిఆర్వో గంగాధర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్ స్టేషన్ల చేర్పులు మార్పులు, తదితర సమస్యలపై వెంటనే తెలియజేయాలన్నారు. ఓటరు జాబి తా ఇంటింటి పరిశీలన దాదాపు పూర్తయి ందని, డెత్, షిఫ్టెడ్, రిపీటెడ్ ఓట్లను ఒకటికి రెండుసార్లు పరిశీలించామని చెప్పారు. జిల్లా లో ఓటర్ జాబితాకు సంబంధించి అందిన క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పక్కాగా పరిశీలన చేస్తున్నామన్నారు. రాజకీయ పార్టీల ప్రతి నిధులందరూ తప్పులు లేని స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపకల్పనకు కషి చేయాలన్నారు. జిల్లాలో డిలీట్ అయిన ఓట్లను బిఎల్‌ఒలు పోలింగ్ స్టేషన్ వారీగా పరిశీలించామని చెప్పారు. జంక్ ఓటర్లను పరిశీలిస్తున్నామని ఇంకా ఎక్కడైనా ఒకే డోర్ నెంబర్‌లో10 కంటే ఎక్కువ ఓట్లు ఉంటే తమ దష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహాయ సహకారాలు అందించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అన ంతరం నియోజకవర్గాల వారీగా వివిధ అంశాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ చర్చించారు. కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు బి. హరిప్రసాద్ కానుగ దానం, జి. లక్ష్మణ్ రావు , ప్రసాద్ గౌడ్ , డా.బి శ్రీనివాసులు, కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్‌డిఒలు ధర్మచంద్రారెడ్డి, శ్రీనివాసులు, వెంకట రమణ, వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.










