Dec 08,2022 22:47

ప్రజాశక్తి - ముదినేపల్లి
            స్వచ్ఛగ్రామం కోసం అందరు సమిష్టిగా కృషి చేయాలని ఎంపిడిఒ పి.మల్లీశ్వరి కోరారు. మండలంలోని వాడవల్లి గ్రామంలో వర్మీకంపోస్టు కేంద్రాన్ని గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతకు గ్రామస్తులు అందరు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఆరుబయట మలవిసర్జన చేయరాదన్నారు. గ్రామ వాలంటీర్లు, పారిశుధ్య కార్మికులు గ్రామస్తులకు ఈ విషయమై అవగాహన కల్పించాలన్నారు. ఆరుబయట దోమలు, ఈగలు నీరుపై, ఆహార పదార్థాలపై వాలడం వల్ల ప్రజలు అనేక వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందన్నారు. అందరు సమిష్టిగా గ్రామం పరిశుభ్రంగా ఉండేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి సూదబత్తిన శ్రీను, పంచాయతీ కార్యదర్శి యార్లగడ్డ శ్యాంసుందర్‌, సచివాలయ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.