స్వచ్ఛభారత్ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి: సిఐటియు
ప్రజాశక్తి - ఆత్మకూర్
గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేస్తున్న స్వచ్ఛభారత్ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే మంజూరు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వి యేసు రత్నం డిమాండ్ చేశారు బుధవారం నాడు సుదర్శన వర్మ స్మారక భవనంలో స్వచ్ఛభారత్ కార్మికుల సమావేశం ఆ సంఘం అధ్యక్షులు స్వాములు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేస్తున్న స్వచ్ఛభారత్ కార్మికులను ఈ ప్రభుత్వం జీతాలు లేని బానిసల్లాగా చూస్తుందని ఆరోపించారు ఎనిమిది నెలలుగా స్వచ్ఛభారత్ కార్మికులకు వేతనాలు ఇవ్వకపోతే ఎలా జీవిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు స్వచ్ఛభారత్ కార్మికులతో గ్రామ సర్పంచులు పారిశుద్ధ్య పనులతో పాటు ఎలక్ట్రికల్ వర్క్స్ మంచినీటి పైప్ లైన్లు గుంతలు తీయడం బోరింగ్ చేయడం సచివాలయ భవనాలు రకరకాల పనులను చేయిస్తూ బానిసలకంటే హీనంగా చూస్తున్నారని జీతాలు ఇవ్వమని అడిగితే మీరు పనులు మానుకోండి అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వం గ్రామపంచాయతీ నిధుల నుండి జీతాలు ఇవ్వమని జీవో ఇచ్చినప్పటికీ అమలు చేయడం లేదని ఆరోపించారు చెత్త తీసుకెళ్లే బండ్లు రిపేర్ అయితే స్వచ్ఛభారత్ కార్మికులని సొంత ఖర్చులతో రిపేరు చేయించుకోవాలని అధికారులు ఆదేశించడం తగదన్నారు కొన్ని గ్రామాల్లో ఇప్పటికే పని చేస్తున్న కార్మికులను తొలగించి అధికార పార్టీ నాయకులు ఆ పోస్టులను అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ నిధుల నుండి స్వచ్ఛభారత్ కార్మికులకు జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని స్వచ్ఛభారత్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చెత్త బండను రిపేరు చేయాలని సబ్బు నూనె డ్రెస్సులు పరికరాలు ప్రభుత్వమే సమకూర్చాలని వారి డిమాండ్ చేశారు లేకపోతే సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించవలసి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ స్వాములు స్వచ్ఛభారత్ కార్మికులు హనుమంతు రాజారావు రవి సుబ్బన్న వెంకటేశ్వర్లు అంకన్న రమేష్ సత్యరాజు యాకోబు తదితరులు పాల్గొన్నారు










