
ప్రజాశక్తి - తణుకు రూరల్
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తణుకు పట్టణానికి మంచి ర్యాంకు తీసుకురావడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ కెటి.సుధాకర్ అన్నారు. తడి, పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి అందించి సంపూర్ణ పారిశుధ్యానికి సహకరించిన పలు వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు, పాఠశాలలు, గృహ యజమానులు, హోటల్స్ యాజమాన్యాలకు బుధవారం ప్రశంసాపత్రాలు అందించారు. మెరుగైన పారిశుధ్యానికి సహకరించిన 29 మందికి ప్రశంసాపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఇ ఈశ్వరరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ గోవిందయ్య, ఎఇ శిరీషా పాల్గొన్నారు.