ప్రజాశక్తి- కోటబొమ్మాళి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్య దష్ట్యా ప్రవేశపెట్టిన స్వచ్ఛ పరిశుభ్రతపై అలసత్వం వహిస్తున్నారని స్వచ్ఛ సర్వే రక్ష గ్రామ సర్వే టీం కేంద్ర ఎన్యూమినేటర్ జి. మనోజ్ కుమార్ అన్నారు. శుక్రవారం కోటబొమ్మాళి మండల కేంద్రంలోని వసతి గహాలు. అంగన్వాడీ కేంద్రాలు. దేవాలయాలు. ప్రభుత్వ ఆసుపత్రులు బృంద సభ్యులు పరిశీలించి అమలు, తీరు, తెన్నులు తెలుసుకున్నారు. స్థానిక 35 పడకల సామాజిక ఆసుపత్రిలో డస్ట్ బిన్నులు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని వినియోగించడంలో ఆసుపత్రి సిబ్బంది అలసత్వం వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. బర్నింగ్ యంత్రం ఉన్నప్పటికీ వినియోగించకుండా నేరుగా సిరంజీను డస్ట్ బిన్‌లో వేయటం సరికాదని హెచ్చరించారు. అనంతరం స్థానిక కొత్త ముద్దలు దేవాలయం పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. స్థానిక ప్రకాష్ నగర్ కాలనీ సమీపంలో ఉన్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి. పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈయన వెంట డిపిఆర్‌సిలు బి. గోవిందరావు. పి. మోజెస్ ప్రసాద్. ఐఇసి ఆర్డబ్ల్యూఎస్ జిల్లా సమన్వయకర్త కె. అమ్మాజీ రావు. ఈవో పిఆర్ ఆర్ డి.తులా. రాజారావు. పంచాయతీ ఇఒ చింతాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










