
ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : ధర్మవరాన్ని స్వచ్చధర్మవరంగా తీర్చిదిద్దడానికి ప్రజలందరి భాగస్వామ్యం అవసరమని మున్సిపల్ ఛైర్‌పర్సన్‌కాచర్ల లక్ష్మీ, కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. స్వచ్ఛతా 'లీగ్ 2.0 అండ్ సఫారు మిత్ర సురక్షషివిర్ ధర్మవరం గ్రీన్ గన్నర్స్ కార్యక్రమంలో భాగంగా బుధవారం చైర్ పర్సన్ తో పాటు వైస్ ఛైర్మన్లు జయరామిరెడ్డి, షేక్ షంషాద్ బేగం, కౌన్సిలర్లు, అధికారులు రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు ఇంటిలోని చెత్తాచెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా చెత్త ట్రాక్టర్లో వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ఆనంద్, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు మహబూబ్‌బాషా, శ్యామ్సన్, నాయకులు చాంద్‌బాషా, కాచర్ల అంజి, చెలిమి పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.