Oct 19,2023 22:13

చిత్తూరుఅర్బన్‌: భారతదేశ సమగ్రతను దేశ ఔన్నత్యాన్ని కాపాడుదామని కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ పిలుపునిచ్చారు. ఆజాదీ కాఅమత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం కలెక్టరేట్‌లో మేరా మట్టి మేరా దేశ్‌, కలశ యాత్ర ర్యాలీని నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భారతదేశ సమగ్రత సౌభ్రాతత్వాన్ని పెంపొందించే విధంగా మేరా మట్టి మేరా దేశ్‌ కార్యక్రమం చేపట్టి మట్టిని సేకరించి దేశ రాజధానిలోని పార్లమెంటుకు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈనెల 31 వరకు ఈకార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌, ఇండో టిబెట్‌ బోర్డర్‌ పోలీస్‌ డిప్యూటీ కమాండెంట్‌ ఆశిష్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ రమ్య, జడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి, డ్వామా పీడీ గంగాభవాని, హౌసింగ్‌ పిడి పద్మనాభం, డీపీఓ లక్ష్మి, పివికేఎన్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ భాను ప్రకాష్‌, జిల్లా సైనిక వెల్ఫేర్‌ అధికారి విజయ శంకర్‌ రెడ్డి, నెహ్రూ యువ కేంద్రం జిల్లా కోఆర్డినేటర్‌ ప్రదీప్‌ కుమార్‌, జిల్లా టూరిజం అధికారి నరేంద్ర పాల్గొన్నారు.