ప్రజాశక్తి-పలాస : స్వాతంత్య్ర ఉద్యమంలో సిక్కోలు నేతలు కీలకపాత్ర పోషించారని పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. కాశీబుగ్గలోని ప్రయివేటు కళ్యాణ మండపంలో శనివారం 'స్వాతంత్య్రోద్యమంలో సిక్కోలు వీరులు' అనే పుస్తకాన్ని వాణిజ్య పన్నుల శాఖ మాజీ డిప్యూటీ కమిషనర్ జుత్తు తాతారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులను అన్వేషించి పుస్తకాన్ని రచించిన కుత్తం వినోద్‌కుమార్‌ను అభినందించారు. కార్యక్రమంలో కుత్తం హేమావతి, డాక్టర్ జి.లీలవరప్రసాద్ రావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోదండ కృష్ణ, సిక్కోలు జానపద సాహిత్య కళావేదిక అధ్యక్షులు రాపాక ధనరాజు, వంకల రాజారావు, బత్తిని లక్ష్మణ్, కుత్తం అజరుకుమార్, పోతనపల్లి కుసుమ పాల్గొన్నారు.










