Sep 26,2023 22:33

  టి.నరసాపురం:స్వాతంత్ర సమరయోధులు చిరస్మరణీయులని బొర్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహమ్మద్‌ ఆలీ అన్నారు. మన మట్టి - మన దేశం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జాతీయ నాయకుల చిత్ర పటాలతో స్వాతంత్ర సమరం నాటి నినాదాలు చేస్తూ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలీ మాట్లాడుతూ విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. స్వాతంత్ర సమరంలో ప్రాణాలు అర్పించిన మహనీయులను స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్‌ పరసా శ్రీను, ఉపాధ్యాయులు కొప్పుల నాగేశ్వరరావు, ఆంజనేయులు, సుష్మ, దీపిక, పి.మధు పాల్గొన్నారు.