Aug 15,2023 20:37

విఎస్‌యులో మాట్లాడుతున్న సుందరవల్లి

ప్రజాశక్తి -వెంకటాచలం :మండలంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థల్లో త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్యజి ఎం సుందరవల్లి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రిజిస్ట్రార్‌ ఆచార్య ఆర్‌ రామచంద్రా రెడ్డి ,కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య జి విజయ ఆనంద కుమార్‌ బాబు పాల్గొన్నారు. తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ కష్ణయ్య కార్యాలయం వద్ద ఎంపిపి మంద కవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో జాతీయ జెండా ఆవి ష్కరించారు. సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు.