Aug 14,2023 20:55

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన పెరేడ్‌ మైదానం

రాయచోటి/రాయచోటి టౌన్‌ :77వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని పోలీస్‌ పెరేడ్‌ మైదానం ముస్తాబయింది. సోమవారం అన్నమయ్య జిల్లా రాయచోటిలోని పోలీస్‌ పెరేడ్‌ మైదానంలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కనుల పండువుగా ఉదయం 8.35 వేడుకలు ప్రారంభం అవుతాయి. కలెక్టరేట్‌, ఎస్‌పి కార్యాలయాలు సుందరంగా ముస్తాబయ్యాయి. మంగళవారం నిర్వహించే వేడుకలకు అధికారిక యంత్రాంగం ఏర్పాట్లును సర్వం సిద్ధం చేసింది. ఇన్‌ఛార్జి మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి, ఎంఎల్‌ఏలు, కలెక్టర్‌, ఎస్‌పి తదితర ఉన్నతాధికారులచే రెండవ సారి జెండా ఎగురవేయనున్నారు. వివిధ శాఖల శకటాల ప్రదర్శన, సాంస్కతిక కార్యక్రమాలు రంగరంగ వైభవంగా నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నారు.
వేడుకల ఏర్పాట్ల పరిశీలన
స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పెరేడ్‌ గ్రౌండ్‌ సిద్ధమైంది. సోమవారం వేర్వేరుగా కలెక్టర్‌ గిరీష, ఎస్పీ ఆర్‌.గంగాధర్‌రావు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల పరేడ్‌ రిహార్సల్స్‌ ను పరిశీలించారు. ఆర్మ్డ్‌ రిజర్వ్‌ డిఎస్‌పి ఎస్‌.మహబూబ్‌ బాషా పెరేడ్‌ కమాండర్‌గా రిహార్సల్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పోలీసుల కవాతు రిహార్సల్స్‌, భద్రత, బందోబస్తు ఏర్పాట్లును పరిశీలించామని రిహార్సల్స్‌లో భాగంగా ముందుగా సిబ్బంది నుండి జిల్లా ఎస్పీ గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకం ఎగుర వేశారు. అనంతరం కవాతు పరిశీలన వాహనంలో వెళ్లి సాయుధ పోలీసు బలగాల పరేడ్‌ ప్రదర్శన పరిశీలించి కవాతును నిర్వహించడంలో కొన్ని సూచనలు, మెళుకువలు సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు మరింత ఉత్సాహంగా కవాతు ప్రదర్శన చేయాలని సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవ రోజున జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీస్‌ కవాతు, శకటాల ప్రదర్శన, తదితర వేడుకలను తిలకించేందుకు వస్తున్నా రాజకీయ ప్రముఖులు, స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలు, ఉన్నతాధికారులు, ప్రజలకు కల్పించాల్సిన భద్రత ఏర్పాట్లును సమీక్షించి, ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, వాహనాల పార్కింగ్‌ తదితర అంశాలపై అధికారులకు పలు సూచలను చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్‌ వి.బి.రాజ్‌ కమల్‌, ఆర్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.