గౌరవవందనం స్వీకరిస్తున్న ఎస్పీ రవిశంకర్‌రెడ్డి
ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డు మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో జరగనున్న 77వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పరేడ్‌కు ఆదివారం రిహార్సిల్స్ చేశారు. పరివీలించిన జిల్లా ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి పరిశీలించి పలు సూచనలు చేశారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం చేసిన తరువాత అదనపు ఎస్పీ (ఎఆర్) డి.రామచంద్రరాజు పర్యవేక్షణలో ఎఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ సూచనల మేరకు నరసరవుపేట డీఎస్పీ మహేష్ పరేడ్ కమాండర్‌గా ఎస్పీకి గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీస్ కవాతు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్సీ (అడ్మిన్) ఆర్.రాఘవేంద్ర, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










