ప్రజాశక్తి - పార్వతీపురం : స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు శుక్రవారం పరిశీలించారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో చేస్తున్నట్టు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ పరిశీలనలో ఆర్‌డిఒ కె.హేమలత, డిఎస్‌పిబి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
వేడుకలు పకడ్బందీగా నిర్వహించాలి : పిఒ
సీతంపేట : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు ఉండాలని ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి అన్నారు. శుక్రవారం స్థానిక గ్రీన్ ఫీల్డ్ స్టేడియాన్ని సంబంధిత అధికారులతో పరిశీలించి, ఏర్పాట్లపై సమీక్షించారు. వేడుకలకు హాజరయ్యే విద్యార్థులు, ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. దేశభక్తిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డిిడి శ్రీనివాసరావు, ఎపిఒ రోషి రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ సింహాచలం, ఎటిడబ్ల్యూఒ మంగవేణి, ఐటిడిఎ స్పోర్ట్ ఇన్‌ఛార్జి జాకబ్ దయానంద్, ఎఎంఒ కోటిబాబు, సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










