Oct 20,2023 20:15

ప్రజాశక్తి - వీరవాసరం
ప్రతి ఒక్కరూ స్వాతంత్ర సమరయోధులను గుర్తుంచుకోవాలనే తలంపుతో భారత ప్రభుత్వం చేపట్టిన అమృత కలశ యాత్రను భీమవరం నియోజకవర్గంలో విజయవంతం చేయడం జరిగిందని భీమవరం ఎంల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. నందమూరుగరువులో శుక్రవారం అమృత కలశ యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో విభిన్న జాతులు, మతాలు, సంస్కృతులు ఒకటేనని చాటిచెప్పడం ఈ యాత్ర ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ ఎం.సుందరాజు, ఎంపిడిఒ జ్యోతి, సర్పంచులు మేకల చలపతిరావు, కందుల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఆచంట:దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర జవాన్లను గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఎంపిడిఒ నరసింహ ప్రసాద్‌ అన్నారు. మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం వద్ద శుక్రవారం మోడీ శ్రీకారం చుట్టిన మేరీ మట్టి.. మేరా దేశ్‌ కార్యక్రమాన్ని ఎంపిపి దిగమర్తి సూర్యకుమారి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ భారతదేశంలో పండే పంటలు ప్రపంచంలో ఏ దేశంలోనూ పండవన్నారు. అనంతరం సచివాలయ సిబ్బంది పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ సుబ్రహ్మణ్యం, ఇఒపిఆర్‌డి.మూర్తిబాబు, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
పెనుమంట్ర :ఎంపిడిఒ కార్యాలయంలో నా మట్టి - నా దేశం కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల నుంచి సేకరించిన మట్టిని అమృత కలశ యాత్ర ద్వారా దేశ రాజధానికి పంపే కార్యక్రమం ఎంపిడిఒ పి.పద్మజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్‌ నుంచి బ్రాహ్మణ చెరువు సెంటర్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపిపి కర్రి వెంకటనారాయణ రెడ్డి (వాసు రెడ్డి), ఎఎంసి ఛైర్మన్‌ వెలగల వెంకటరమణ (మిస్సమ్మ), జెడ్‌పిటిసి కర్రి గౌరీ సుభాషిణి, వైసిపి మండల అధ్యక్షుడు గూడూరి దేవేంద్రుడు, సర్పంచులు, ముదునూరి నాగరాజు, వనుము సూర్య నారాయణ పాల్గొన్నారు.