Aug 15,2023 20:24

పోడూరు:భారత ప్రభుత్వం వివిధ ప్రత్యేక సందర్భాల్లో విడుదల చేసిన స్మారక నాణేలను స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల చింతల గరువులో కొల్లాబత్తుల సూర్యకుమార్‌ మంగళవారం ప్రదర్శించారు. వివిధ దేశాల కరెన్సీ సేకరణే హాబీగా కలిగిన సూర్యకుమార్‌ మాస్టారు సేకరించారు. స్వాతంత్ర సమరయోధుల ముఖచిత్రంతో ముద్రించిన స్మారక నాణేలు, అంబేద్కర్‌ స్మారక నాణెం, కుకా ఉద్యమ స్మారక నాణెం, పోర్ట్‌ బ్లెయిర్‌ జైలు స్మారక నాణెం, ఇండిపెండెన్స్‌ డే మెడల్‌ మొదలైన వాటిని పాఠశాలలో ప్రదర్శించారు. విద్యార్థులు వాటిని తిలకించారు.