తేలికగా దూరి
బరువుతో బయటకు వస్తా
సులువుగా తేలి
మురికి పూడిక తీస్తా!
వెళ్లే దారంతా అర్థం కాని చీకటి గుహలే
ఆసాంతం సూచిక లేని గమ్మత్తు దారులే!
ఊపిరి సలపని మలుపులు ఎన్నో
ఉక్కిరిబిక్కిరి చేసే గతుకులు ఎన్నో!
మనసు బరువు గుండె కుదుపు
కడుపు చెమ్మ అన్నిటికీ సాక్షిని!
పుట్టిన క్షణం నుంచి విడవని పరుగే
కాలం తీరేవరకు వదలని కర్తవ్యమే!
ధ్యానం, ధ్యాస నాకు ఆయువు దాతలే
ధూపం, ధూమం నాకు ప్రాణ సంకటాలే!
అలసత్వం చూపితే కోలుకోలేని దెబ్బలే
లిప్తకాలం ఆగితే జరిగేవన్నీ ఘోరాలే!
- ఉషారం, 95538 75577