Sep 29,2023 22:30

ప్రజాశక్తి - భట్టిప్రోలు
వ్యవసాయ రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌ చిత్రపటానికి ఎఎంసి చైర్మన్ ఉప్పు శిరీష, కమిటీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వ్యవసాయ రంగం మరింత ముందుకు నడవడానికి ఇండియాతో పాటు పాకిస్తాన్‌లో కూడా ఆధునిక పొంగడాలను అందించి వ్యవసాయ విప్లవానికి నాంది పలికిన మహోన్నత వ్యక్తి అని  కొనియాడారు. కార్యక్రమంలో ఎఎంసి డైరెక్టర్ కౌతరపు శ్రీనివాసరావు, సర్పంచ్ ధారా రవికిరణ్మయి, రావు వాసు, షేక్ సలీం, నబి, పసుపులేటి శివరాం ప్రసాద్ ఉన్నారు.