Jan 27,2023 22:17

ప్రజాశక్తి - గణపవరం
             డిల్లీలో రైతుల ఉద్యమం సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలు తక్షణం అమలు చేయాలని కోరుతూ సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపులో భాగంగా శుక్రవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కృష్ణస్వామికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతుసంఘం మండల కార్యదర్శి గుత్తుల శ్రీను, కౌలు రైతుల సంఘం జిల్లా నాయకులు పి.నరసింహమూర్తి, కెవిపిఎస్‌ మండల కార్యదర్శి చిన్న నాగేశ్వరరావు, సిఐటియు మండల అధ్యక్షులు ఎం.పెంటారావు మాట్లాడుతూ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేసి పంటలకు మద్దతు ధరతోపాటు మద్దతు గ్యారెంటీ చట్టం చేయాలని, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు.