Sep 30,2023 21:55

ప్రజాశక్తి - పెంటపాడు
            భారతదేశంలో హరిత విప్లవానికి మార్గదర్శ కుడు ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎంఎస్‌.స్వామినాథన్‌ (98) మృతికి సిపిఎం, రైతు సంఘం తమ ప్రగాఢ సంతాపం, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపింది. ఎస్‌.రంగారావు, చిర్ల పుల్లారెడ్డి మాట్లాడుతూ 1960 దశకంలో అధిక దిగుబడినిచ్చే గోధుమలు, వరి రకాలను అభివృద్ధి పరిచి, ప్రాచుర్యం కల్పించడంలో కీలక పాత్ర పోషించినందుకు గుర్తింపుగా 1987లో స్థాపించిన ప్రపంచ ఆహార బహుమతిని మొదటిసారిగా అందుకున్నారని గుర్తు చేశారు. 1988లో ఎంఎస్‌.స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ను స్థాపించా రన్నా రు. చల్లా చందర్రావు, అల్లు సుబ్బారావు, కొల్లి రామకృష్ణ, వెన్నెల, చిన్న శ్రీను, మాదా సు రాజు, ప్రసాద్‌, మీసాల శ్రీనివాస్‌, మహేష్‌, సీతయ్య, కేతిరెడ్డి, అప్పన్న పాల్గొన్నారు.