Sep 29,2023 22:59

ప్రజాశక్తి-మచిలీపట్నంరూరల్‌ : వ్యవసాయ రంగం లో విప్లవాత్మక మార్పులు కు నాంది పలికిన డాక్టర్‌ ఎం ఎస్‌ స్వామినాథన్‌ మరణం దేశానికి తీరని లోటని కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి జ్ఞానమణి పేర్కొన్నారు. శుక్రవారం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఎం ఎస్‌ స్వామినాథన్‌ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ 1960 వ దశకంలో మనదేశం ఆహార ధాన్యాలు కొరత సమస్య తో ఇబ్బందులు ఎదుర్కొనేదని, ఆ దశలో స్వామినాథన్‌ పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో ప్రయోగాలు చేసి తద్వారా దేశ వ్యాప్తంగా ఆహార ధాన్యాలు సమద్ధిగా పండించే స్థాయికి తీసుకొచ్చారని చెప్పారు. నేడు ప్రపంచంలో ఆహార ధాన్యాలు కొరతను ఎదుకొంటున్న దేశాల కు మనం ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ డా బ్రహ్మచారి, సహాయ ఆచార్యులు డా సుశీల, డా సురేష్‌, డా మాధురి, డా స్వరూపా, విద్యార్థులు పాల్గొన్నారు.