అవును, ప్రవాహానికి ఎదురుగా
శవాలు ఈదుతున్నాయి
మనుషులు చాలా మంది
ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు
చారు అమ్మి ఎదిగానన్న బాలుడినీ
సేల్సు గాళుగా ఎదిగానన్న యువతినీ
నమ్మి నెత్తికెత్తి పెట్టుకున్నారు
ఇప్పుడు దేశాన్నే అమ్మేస్తున్నా కాస్తున్నారు
మద్యం జాతీయం చేస్తే
చప్పట్లు కొడుతున్నారు
జాతీయం చేసిన (ప్రభుత్వ)రంగాన్ని
అమ్మేస్తుంటే చూస్తున్నారు
జాతీయీకరణలో పుట్టిన శిశువులు
కార్పొరేట్ల మేతకు అమ్మేసే
పశువులను
తరమడానికి ఉరుముతుంటే
దేశం కోసం దేహాలప్పగించిన
నేతలే లేచినట్లుంది
పోరాడే ప్రేరణ నింపినట్లుంది
ఎందుకో పాలనా విధానాల ధాటికి
భారాలన్నీ ఘోరంగా సలుపుతున్నా
బతికున్న మనుషుల్లో కొందరు చలనంలో లేక
ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు
ఉన్నం వెంకటేశ్వర్లు
87900 68814