బతుకు
భయానికి
మనిషిని నిలువెల్లా
కుదిపేసి
ఎన్నో ఆయువులను
తనతో తీసుకెళ్లిన
గతవత్సరపు
కష్టాలు తీర్చేది తానేనని,
గడచిన నిరాశల కలుపు తీసి
పూలబాటన నడిపించే నేస్తాన్నని
తుషార బిందువులు
మంచి ముత్యాలై
పుడమి మెడలో
అలంకారాలుగా మెరిసేటి వేళ
కొత్త సంఖ్య తగిలించుకొని
గోడకు కొట్టినమేకుకు
మరో నేస్తాన్ని అందించేందుకు
విచ్చేస్తున్న
'నూతన సంవత్సరానికి'
ఆనందాలతో
మనసున వికసించే
ఆశల పుష్పాలతో
స్వాగతం పలుకుదాం
పడిలేచే కెరటంలా
నిన్న తీరని ఆశలను
రేపటి
ఆశయాలుగా మార్చుకొంటూ
కర్తవ్య సాధనలో
ముందుకు సాగుదాం
కొత్త మార్పులను స్వాగతిద్దాం
- వేమూరి శ్రీనివాస్
99121 28967