Oct 30,2023 22:56

ప్రజాశక్తి - కడియం విద్యారంగంలో చేస్తున్న విశేష కృషిని గుర్తించి ఈదా ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ అందిస్తున్న ''గురుస్పందన'' పురస్కారం స్థానిక జడ్‌పి ఉన్నత పాఠశాల ఇంగ్లీష్‌ ఉపాధ్యాయిని డాక్టర్‌ బి.సువర్ణ వేణికి లభించింది. ఏలూరులోని ఆర్‌ఆర్‌ పేట అతిధి హోటల్లో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి, ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి పి.శ్యామ్‌ సుందర్‌, ఫౌండేషన్‌ ఛైర్మన్‌ ఇదా సామ్యూల్‌ రెడ్డి, సెక్రటరీ టి.సాయిరాం ల చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని సువర్ణవేణి అందుకున్నారు. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి.సత్యనారాయణ, పాఠశాల సిబ్బంది సువర్ణ వేణికి అభినందనలు తెలిపారు.