ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండలంలో అతి మారుమూల పంచాయతీ సుత్తిగూడ గ్రామంలో టిడిపి అరకు పార్లమెంట్ సెక్రెటరీ శాస్త్రిబాబు ఆధ్వర్యాన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రిబాబు మాట్లాడుతూ, సుత్తిగూడ గ్రామంలో సీసీ రోడ్లు, మంచినీరు సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టాలు, రైతు భరోసా, ప్రభుత్వ పధకాలు కల్పించాలని తెలిపారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో సంక్షేమ పథకాలు అందరికీ అమలు అయ్యాయని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. గిరిజన రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడిపి సీనియర్ నాయకులు నీలకంఠం పాత్రో, రామదాసు, భగత్‌రామ్, రఘుపతి పడాల్, సుబ్రహ్మణ్యం, గురుమూర్తి, కిల్లో రోబ్బి, దశరధి, రామకృష్ణ, గురుమూర్తి పాల్గొన్నారు.










